NHAI Deputy Manager (Technical) Posts on Direct Recruitment Basis 2025
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) తాజాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు కావలసిన అర్హతలు, జీతం, అప్లై చేయు విధానం, ఎంపిక విధానం తదితర వివరాలు ఇక్కడ క్లుప్తంగా ఇవ్వడం జరిగింది, పూర్తిగా చదివి అర్హులైనట్లయితే అప్లై చేసుకోవచ్చు.
సంస్థ పేరు:
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI).
పోస్టుల సంఖ్య:
మొత్తం 60 పోస్టులు
పోస్టుల వివరాలు:
డిప్యూటీ మేనేజర్ ( టెక్నికల్): 60 పోస్టులు
ఈ నోటిఫికేషన్ ద్వారా NHAI డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది.
విద్యార్హత:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో GATE-2024 స్కోరు ఉండాలి.
వయస్సు:
ఈ పోస్ట్ కు అప్లై చేసే అభ్యర్థికి 30 సంవత్సరాలు మించి ఉండరాదు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టుకు ఎంపికైన ఉద్యోగులకు నెలకు ₹56,100 నుండి ₹1,77,500 జీతం ఉంటుంది. జీతంతో పాటు అన్ని రకాల అలవెన్సులు ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
ఈ పోస్టుకు అప్లై చేసిన అభ్యర్థులను GATE-2024 స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. అవసరమైతే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
అప్లై చేయు విధానం:
ఈ పోస్ట్ కు అర్హులైన అభ్యర్థులు NHAI సంస్థ వెబ్ సైట్ ద్వారా Online విధానంలో Apply చేయవలెను. మరి ఇతర విధానాల ద్వారా దరఖాస్తులు స్వీకరించబడవు.
ముఖ్యమైన తేదీలు:
Online అప్లికేషన్ ప్రారంభ తేదీ: 23/ జనవరి/2025.
Online అప్లికేషన్ చివరి తేదీ: 24/ ఫిబ్రవరి/2025.
ముఖ్యమైన లింకులు:
Online లో Apply చేయడానికి సంబంధించిన లింకును(Link), అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Apply Online అప్లికేషన్ | Click Here |
అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ | Click Here |
అఫీషియల్ వెబ్ సైట్ | Click Here |
Join Telegram Group | Click Here |
Join WhatsApp Group | Click Here |
ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.