AAI Direct Recruitment Of Junior Executives 2025
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు కావలసిన అర్హతలు, శాలరీ, అప్లై చేయు విధానం, ఎంపిక విధానం తదితర వివరాలు పూర్తిగా చదివి అర్హులైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా అప్లై చేసుకోండి.
సంస్థ పేరు:
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(Airports Authority of India).
పోస్టుల సంఖ్య:
83 పోస్టులు
పోస్టుల వివరాలు:
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థలోని మూడు విభాగాలలో పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
1). జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీస్): 13 పోస్టులు
2). జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్): 66 పోస్టులు
3). జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్): 04 పోస్టులు
విద్యార్హత:
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు పోస్ట్ కు సంబంధించిన విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ పాసై ఉండాలి. పూర్వ పని అనుభవం కూడా ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18/03/2025 నాటికి 27 సంవత్సరాలు మించి ఉండకూడదు.
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం:
నెలకు ₹40,000 – ₹1,40,000 ఉంటుంది. జీతంతో పాటు అన్ని రకాల అలవెన్సులు ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీజు 1000/- చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ అప్రెంటిసిస్ అభ్యర్థులు ఒకవేళ సంవత్సరం పాటు AAI అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పూర్తి చేసినట్లయితే, వారికి మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులను రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా పోస్టుకు ఎంపిక చేస్తారు.
అప్లై చేయు విధానం:
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు AAI వెబ్ సైట్ ద్వారా Online విధానంలో మాత్రమే అప్లై చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
Online అప్లికేషన్ ప్రారంభ తేదీ : 17/ ఫిబ్రవరి/ 2025.
Online అప్లికేషన్ చివరి తేదీ : 18/ మార్చి/ 2025.
ముఖ్యమైన లింకులు:
Online లో Apply చేయడానికి సంబంధించిన లింకును(Link), అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Apply Online అప్లికేషన్ | Click Here |
అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ | Click Here |
అఫీషియల్ వెబ్ సైట్ | Click Here |
Join Telegram Group | Click Here |
Join WhatsApp Group | Click Here |
ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.