Indian Army Jobs 2025
ఇండియన్ ఆర్మీ 76 ఉద్యోగాలకు షార్ట్ సర్వీస్ కమిషన్(SCC) ద్వారా NCC స్పెషల్ ఎంట్రీ స్కీం 58వ కోర్సు (అక్టోబరు 2025) ప్రవేశాలకు అర్హులైన పెళ్లి కానీ పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది పూర్తిగా చదివి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి.
సంస్థ పేరు(Organization Name):
ఇండియన్ ఆర్మీ(Indian Army).
పోస్టుల సంఖ్య:
76 పోస్టులు
NCC పురుషులు: 70 పోస్టులు
NCC మహిళలు: 06 పోస్టులు
ప్రత్యేకంగా 8 పోస్టులు యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు అందుబాటులో ఉంటాయి.
విద్యార్హత:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న ఆఖరి సంవత్సరం విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
NCC ‘C’ సర్టిఫికెట్ ఎగ్జామ్ లో కనీసం ‘B’ గ్రేడ్ పొంది ఉండాలి. కనీసం రెండు లేదా మూడు సంవత్సరాలు NCC సీనియర్ డివిజన్/ వింగ్ లో కొనసాగి ఉండాలి.
NCC ‘C’ యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు సర్టిఫికెట్ అవసరం లేదు.
వయస్సు:
2025 జూలై 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 19 ఏళ్ల నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం:
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ కాలవ్యవధిలో నెలకు 56,100/- స్టైఫండ్ ఇస్తారు.
ఎంపిక విధానం:
అప్లై చేసిన అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. షార్ట్ లిస్టింగ్ లో ఉన్న అభ్యర్థులకు స్టేజ్-1 మరియు స్టేజ్-2 టెస్టులు ఉంటాయి.
చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ తో పాటు డాక్యుమెంట్స్ పరిశీలించి సెలెక్ట్ చేస్తారు.
ట్రైనింగ్:
ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో(OTA) 49 వారాలపాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి మద్రాస్ యూనివర్సిటీ నుండి” పీజీ డిప్లమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ & స్ట్రాటజిక్ స్టడీస్” డిగ్రీ ఇస్తారు.
శిక్షణ అనంతరం లెఫ్ట్నెంట్ హోదాలో విధుల్లోకి నియామకం ఉంటుంది.
అప్లై చేయు విధానం:
అర్హులైన అభ్యర్థులు Indian Army వెబ్ సైట్ Online లో మాత్రమే అప్లై చేయవలెను.
మరి ఏ విధంగానూ దరఖాస్తులు స్వీకరించబడవు.
ముఖ్యమైన తేదీలు:
Online అప్లికేషన్ ప్రారంభ తేదీ: 14/ ఫిబ్రవరి/2025.
Online అప్లికేషన్ చివరి తేదీ: 15/ మార్చి/2025.
ముఖ్యమైన లింకులు:
Online లో Apply చేయడానికి సంబంధించిన లింకును(Link), అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Apply Online అప్లికేషన్ | Click Here |
అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ | Click Here |
అఫీషియల్ వెబ్ సైట్ |
Click Here |
Join Telegram Group | Click Here |
Join WhatsApp Group | Click Here |
ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.