తెలంగాణ తపాలా శాఖలో 519 GDS ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా | Telangana GDS Postal Jobs 2025 | Apply Online

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Telangana GDS Postal Jobs 2025

పోస్టల్ డిపార్ట్మెంట్(India Post Office) ఇప్పటికే దేశంలోని అన్ని సర్కిల్స్ లో ఖాళీగా ఉన్న 21,413 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోస్ట్ ఆఫీస్ లలో 519 GDS ఖాళీలను భర్తీ చేయనుంది.

వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కావలసిన అర్హతలు, జీతం, అప్లై చేయు విధానం, ఎంపిక విధానం తదితర విషయాలు ఇక్కడ క్లుప్తంగా ఇవ్వడం జరిగింది, పూర్తిగా చదివి  అప్లై చేసుకోండి.

సంస్థ పేరు:

భారత తపాలా శాఖ (India Post Office).

తెలంగాణలోని పోస్టుల సంఖ్య:

519 పోస్టులు

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని అన్ని పోస్ట్ ఆఫీస్ లలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ పోస్టులు ఏమనగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్  మాస్టర్(ABPM) మరియు డాక్ సేవక్(DS).

విద్యార్హత:

అప్లై చేసేవారు పదవ తరగతి పాస్ అయి ఉంటే చాలు.

వయస్సు:

అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఓబీసీ దివ్యంగులకు 13 సంవత్సరాలు,ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులకు 15 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో  సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ₹100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు.

జీతం:

బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM): ₹12,000 – ₹29,380

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM) & డాక్ సేవక్(DS): ₹10,000 – ₹24,470

వీటితోపాటు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల అలవెన్సులు  ఉంటాయి.

అప్లై విధానం:

అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్ సైట్ నుండి మాత్రమే అప్లై చేయాలి. Online ద్వారా మాత్రమే అప్లికేషన్స్ స్వీకరించబడతాయి.

ఎంపిక విధానం:

అప్లై చేసిన అభ్యర్థుల పదవ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ తీస్తారు. మీ అప్లికేషన్ మెరిట్ లిస్టులో వస్తే మీకు జాబు వస్తుంది. మరి ఏ విధమైన రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదా ఇతర పరీక్షలు ఉండవు.

ముఖ్యమైన తేదీలు:

Online అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10/ఫిబ్రవరి/2025.

Online అప్లికేషన్ చివరి తేదీ    : 03/మార్చి/2025.

ముఖ్యమైన లింకులు:

ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించిన లింకును, అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

Apply Online అప్లికేషన్ Click Here
అఫీషియల్  జాబ్ నోటిఫికేషన్ Click Here
అఫీషియల్ వెబ్ సైట్
Click Here
Join Telegram Group Click Here
Join WhatsApp Group Click Here

ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

 

 

Leave a Comment

error: Content is protected !!