Central Bank of India Credit Officer Recruitment 2025
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్/స్కేల్-I అయినా క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, దీని హెడ్ ఆఫీస్ ముంబై లో ఉంది. ఇండియాలో ఈ బ్యాంకు మొత్తం 4500 పైన బ్రాంచీలు కలిగి ఉంది. ఈ బ్యాంకులో దాదాపు 33,000 పైన ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఈ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయాలంటే కావాల్సిన అర్హతలు, జీతం, వయస్సు, ఎంపిక విధానం, అప్లై ఎలా చేసుకోవాలో తదితర విషయాలు చూసుకొని అప్లై చేసుకోండి.
కంపెనీ పేరు:
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central Bank of India).
పోస్టుల సంఖ్య:
మొత్తం 1000 ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
క్రెడిట్ ఆఫీసర్ ( జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్-1 గ్రేడ్)
విద్యార్హత:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి 60% మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. ( ఎస్సీ/ ఎస్టి/ ఓబిసి/ పిడబ్ల్యూబిడి కేటగిరి వారు డిగ్రీలో 55% మార్కులతో పాస్ అయి ఉండాలి).
వయస్సు:
ఈ జాబ్ కు అప్లై చేసుకునే వారి వయసు20-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, EWS మరియు OBC అభ్యర్థులు ₹750 ఫీజు చెల్లించాలి. SC/ST/PWD/Women అభ్యర్థులకు ₹150 ఫీజు ఉంటుంది.
జీతం:
నెలకు ₹48,480 నుండి ₹85,920 ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ జాబ్ ను అప్లై చేసిన వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఈ జాబ్ కు సెలెక్ట్ చేస్తారు. రాత పరీక్షలో నెగటివ్ మార్కులు ఉండవు.
అప్లై చేయు విధానం:
అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లో అప్లై చేయాలి. దీనికి సంబంధించిన అప్లికేషన్ Online లింకు చివర ఉంటుంది, Apply చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ONLINE అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30/జనవరి/2025.
ONLINE అప్లికేషన్ చివరి తేదీ : 20/ఫిబ్రవరి/2025.
ముఖ్యమైన లింకులు:
ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించిన లింకును, అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Apply Online అప్లికేషన్ | Click Here |
అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ | Click Here |
Join Telegram Group | Click Here |
Join WhatsApp Group | Click Here |
ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.